LYRICS, TUNE: JOHN J
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య (2)
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య (2)
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య (2) || రాజా ||
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం (2)
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును (2)
నీవే రాకపోతే నేనేమైపోదునో (2) || నేనుండలేనయ్య||
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2)
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు (2)
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య (2) || నేనుండలేనయ్య||
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా (2)
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2)
నిన్ను మించిన దేవుడే లేడయ్య (2) || నేనుండలేనయ్య||
Raja Nee Sannidhilone Untanayya - Telugu Lyrics in English
Raja Nee Sannidhilone Untanayya
Manasara Aradhisthu Brathikestanayya (2)
Nenundalenayya Ne Brathukalenayya (2)
Neeve Lekunda Nenundalenayya
Nee Thode Lekunda Ne Brathukalenayya (2) || Raja ||
Nee Sannidhanamulo Sampurna Santhosham
Aradhinchukone Viluviena Avakasam (2)
Kolpoyinavanni Naku Ichutakunu
Badhala Nundi Brathikinchutakunu (2)
Neeve Rakapothe Nenemiepodhuno (2) || Nenundalenayya ||
Vontari Poru Nannu Visiginchina
Manushulellaru Nannu Thappupattina (2)
Vontarivade Veyi Mandhi Annavu
Nenunnanule Bhayapadaku Annavu (2)
Nenante Neeku Intha Prema Yentayya (2) || Nenundalenayya ||
Oopiragevaraku Neethone Jeevistha
Ye dharilo Nadipina Nee Vente Nadichosta (2)
Viswavaniki Kartha Neeve Na Gamyamu
Nee Batalo Naduchuta Nakentho Istamu (2)
Ninnu Minchina Dhevude Ledayya (2) || Nenundalenayya ||
No comments:
Post a Comment