Tuesday, February 28, 2023

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య తెలుగు Lyrics, Raja Nee Sannidhilone Telugu Lyrics in English

LYRICS, TUNE: JOHN J


 రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య    

మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య  (2)

నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య  (2)

నీవే లేకుండా నేనుండలేనయ్య

నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య  (2) || రాజా || 


నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం

ఆరాధించుకొనే విలువైన అవకాశం  (2)

కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును

బాధల నుండి బ్రతికించుటకును  (2)

నీవే రాకపోతే నేనేమైపోదునో  (2)  || నేనుండలేనయ్య|| 


ఒంటరి పోరు నన్ను విసిగించిన  

మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా  (2)

ఒంటరివాడే వేయి మంది అన్నావు

నేనున్నానులే భయపడకు అన్నావు  (2)

నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య  (2)  || నేనుండలేనయ్య|| 


ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా

ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా (2)

విశ్వానికి కర్త నీవే నా గమ్యము

నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2)

నిన్ను మించిన దేవుడే లేడయ్య (2)   || నేనుండలేనయ్య|| 


Raja  Nee Sannidhilone Untanayya - Telugu Lyrics in English


Raja  Nee Sannidhilone Untanayya

Manasara Aradhisthu Brathikestanayya  (2)

Nenundalenayya Ne Brathukalenayya (2)

Neeve Lekunda Nenundalenayya

Nee Thode Lekunda Ne Brathukalenayya  (2) || Raja || 


Nee Sannidhanamulo Sampurna Santhosham

Aradhinchukone Viluviena Avakasam  (2)

Kolpoyinavanni Naku Ichutakunu

Badhala Nundi Brathikinchutakunu  (2)

Neeve Rakapothe Nenemiepodhuno  (2)  || Nenundalenayya || 


Vontari Poru Nannu Visiginchina

Manushulellaru Nannu Thappupattina  (2)

Vontarivade Veyi Mandhi Annavu

Nenunnanule Bhayapadaku Annavu  (2)

Nenante Neeku Intha Prema Yentayya (2)   || Nenundalenayya ||  


Oopiragevaraku Neethone Jeevistha

Ye dharilo Nadipina Nee Vente Nadichosta (2)

Viswavaniki Kartha Neeve Na Gamyamu

Nee Batalo Naduchuta Nakentho Istamu (2)

Ninnu Minchina Dhevude Ledayya (2)    || Nenundalenayya || 



Monday, February 27, 2023

నీతో గడిపే ప్రతి క్షణము తెలుగు Lyrics - Neetho Gadipe Prathi Kshanamu Telugu Lyrics in English

  Lyric & Tune by  Ps. Jyothi Raju


నీతో గడిపే ప్రతి క్షణమూ 

ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)

కృప తలంచగా మేళ్లు యోచించగా (2)

నా గళ  మాగదు స్తుతించక – నిను కీర్తించక

యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4)        ||నీతో||


మారా వంటి నా జీవితాన్ని

మధురముగా మార్చి ఘనపరచినావు (2)

నా ప్రేమ చేత కాదు - నీవే నను ప్రేమించి (2)

రక్తాన్ని చిందించి - నన్ను రక్షించావు (2)         ||యేసయ్యా||


గమ్యమే లేని ఓ బాటసారిని

నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)

నా శక్తి చేత కాదు - నీ ఆత్మ ద్వారానే (2)

వాగ్ధానము నెరవేర్చి - వారసుని చేసావు (2)         ||యేసయ్యా||

Neetho Gadipe Prathi Kshanamu  - Telugu Lyrics in English

Neetho Gadipe Prathi Kshanamu 

Anandha Bhashpalu Aagavayya (2)

Krupa Thalanchaga Mellu Yochinchaga (2)

Na Gala Magadhu Sthuthinchaka - Ninu Keerthinchaka - Ninu Keerthinchaka

Yesayya Yesayya - Na Yesayya (4)        ||Neetho||


Maara Vanti Na Jeevithanni

Madhuramuga Marchi Ghanaparachinavu (2)

Na Prema Chetha Kadhu - Neeve Nanu Preminchi (2)

Rakthanni Chindhinchi - Nannu Rakshinchavu (2)     ||Yesayya||


Gamyame Leni O Batasrini

Neetho Unnanu Bhayamu Ledhannavu (2)

Na Sakthi Chetha Kadhu - Nee Aathma Dwarane (2)

Vagdhanamu Neraverchi - Varasuni Chesavu (2)        ||Yesayya||

Saturday, February 25, 2023

ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసేలే తెలుగు Lyrics- Premantu Yedhiena Unte Yesele Telugu Lyrics In English


Lyrics, Tune & Music: Jonah Samuel 

Singer: AnjanaSowmya

 

ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసేలే అది యేసేలే  

మనసున్న మనిషెవరయినా మరి స్పందించి ప్రేమించునులే  (2)

మనసా మనసా స్పందించూ.... నిజమైనప్రేమను గుర్తించూ...  (2)

మనసారా నిను ప్రేమించే ఆ దేవుని ప్రేమకు స్పందించూ   || ప్రేమంటూ|| 


1.ఒక్క చూపులోనే పుట్టుకొచ్చు ప్రేమలెన్నో 

ఒక్క మాటతోనే మాయమవ్వు ప్రేమలెన్నో

వేయినోళ్లు చెప్పలేని గొప్ప భావమే ప్రేమ

ఏ కళ్ళు చూడలేని దైవరూపమే ప్రేమ

ఊహించలేనంతగా నిను ప్రేమించె ఆ దైవము 

చేతల్లో చూపాడుగా నీపై ఉన్న ఆ ప్రేమను

ఇంకెందుకో ఆలస్యము ప్రేమించు యేసయ్యను 

ఇంకెన్నాళ్ళిలా నిర్లక్ష్యము ఏరోజో నీ అంతము   || ప్రేమంటూ|| 


2.మంచివాడ్ని కూడా ద్వేషించునీలోకం 

ఎంత పాపినైన కూడా ప్రేమించెనే దైవం

పాపమంటే రోగం దానివల్లనే మరణం

యేసు ప్రేమలోనే వైద్యం యేసు రక్తమే ఔషధం

మన్నిస్తూ ఉన్నాడుగా నీలో ఉన్న పాపాలను

కాపాడుతున్నాడుగా నీ ప్రాణాత్మదేహాలను

ఇంకెందుకో ఆలస్యము ప్రేమించు యేసయ్యను 

ఇంకెన్నాళ్ళిలా నిర్లక్ష్యము ఏరోజో నీ అంతము  || ప్రేమంటూ|| 

Premantu Yedhiena Unte Yesele  - Telugu Lyrics in English

Premantu Yedhiena Unte Yesele Adhi Yesele

Manasunna Manishevariena Mari Spandhinchi Preminchunule (2)

Manasa Manasa Spandhinchu....Nijamiena Premnu Gurthinchu....  (2)

Manasara Ninu Preminche Aa Dhevuni Premaku Spandhinchu  ||Premantu||


1. Vokka Chupulone Puttukochhu Premalenno

Vokka Matathone Mayamavvu Premalenno

Beyinollu Cheppaleni Goppa Bhavame Prema

Ye Kallu Chudaleni Dievarupame Prema

Voohinchalenthaga Ninu Preminche Aa Dievamu

Chethallo Chupaduga Neepie Unna Aa Premanu

Inkendhuko Alasyamu Preminchu Yesayyanu

Inkennallila Nirlakshyamu Ye Rojo Nee Anthamu  ||Premantu||


2. Manchivadni Kuda Dhveshinchu Neelokam

Yentha Papiniena Kuda Preminchene Dievam

Pamante Rogam Dhanivallane Maranam

Yesu Premalone Viedhyam Yesu Rakthame Owshadham

Mannistu Unnaduga Neelo Unna Papalanu

Kapadutunnaduga Nee Pranathmadhehalanu

Inkendhuko Alasyamu Preminchu Yesayyanu

Inkennallila Nirlakshyamu Ye Rojo Nee Anthamu  ||Premantu||

Friday, February 24, 2023

నేనెల్లప్పుడు యెహోవాను తెలుగు Lyrics- Nenellappudu Yehovanu Telugu Lyrics in English

 A Pranam Kamlakhar Musical

Lyrics, tune, sung by: Dr.Asher Andrew


                                                   పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌

నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ - (2)

అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే

అంతా నా మంచికే - (తన చిత్తమునకు తల వంచితే)-(2)

               అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2)

                       స్తుతియించుట మానను

1. కన్నీళ్ళే  పానములైన - కఠిన దుఃఖ బాధలైన

స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన   (2)

మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)

మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2) || అంతా నా మేలుకే|| 


2. ఆస్తులన్ని కోల్పోయిన - కన్నవారే కనుమరుగైన

ఊపిరి బరువైన - గుండెలే పగిలినా   (2)

యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను - (2)

ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2)    || అంతా నా మేలుకే|| 


3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న

నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?   (2)

నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)

నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)  || అంతా నా మేలుకే|| 


4. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు

సమస్తము సమకూడి - మేలుకై జరుగును  (2)

యేసుని సారూప్యము నేను పొందాలని - (2)

అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2)  || అంతా నా మేలుకే|| 


5. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు

ఇక మీదట నేను - తెలిసికొందును    (2)

ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2)

అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2)   || అంతా నా మేలుకే|| 

Nenellappudu Yehovanu Sannuthinchedhan  - Telugu Lyrics in English

Nenellappudu Yehovanu Sannuthinchedhan

Nithyamu Aayana Keerthi Na Nota Nundun - (2)

Antha Na Meluke - Aradhana Yesuke

Antha Na Manchike - (Thana Chithamunaku Thaka Vanchithe)-(2)

Aradhana Apanu - Sthuthiyinchuta Mananu - (2)

Sthuthiyinchuta Mananu


1. Kannelle Panamuliena - Katina Dhukha badhaliena

Sthithigathule Marina - Avakasam Chejarina  (2)

Maradhu Yesu Prema - Nithyudiena Thandri Prema - (2)

Maradhu Yesu Prema - Nithyudiena Thandri Prema - (2) || Antha Na Meluke|| 


2. Asthulanni Kolpoyina - Kannvare Kanumarugiena

Oopiri Baruviena - Gundele Pagilina  (2)

Yehova Yichenu - Yehova Theesikonenu - (2)

Ayana Namamunake - Sthuthi Kalugu Gaka (2) || Antha Na Meluke|| 


3. Avamanam Yenthiena - Na Vare Kadhanna

Neevu Neevu Thappa Yevarunnaru Akasamandhuna?   (2)

Neevu Nakundaga - Yedhi Nakakkara Ledhu - (2)

Neevu Na Kundaga - Yedhi Nakakkara Ledhu- (2) || Antha Na Meluke|| 


4. Sankalpana Pilupondhi = Ninne Preminchu Naku

Samasthamu Samakudi - Melukie Jarugunu  (2)

Yesuni Sarupyamu Nenu Pondhalani - (2)

Anumathinchina Ee Vuviena Siluvakie - (2) || Antha Na Meluke|| 


5. Neevu Cheyunadhi - Nakippuudu Theliyadhu

Ika Meedhata Nenu - Thelisikondhunu    (2)

Prasthuthamu Samasthamu - Dhukha Karame - (2)

Abhyasinchina Neethi - Samadhana Phalame - (2)  || Antha Na Meluke|| 



Thursday, February 23, 2023

ఏపాటి దాననయా తెలుగు lyrics- Yepati Dhananaya Telugu Lyrics in English

Vocals - Dr.Shiny

Lyrics & Tune - Pastor D.Chrisostam

Music - Bro. Jonah Samuel 


ఏపాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు  

నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2)


 నా దోషము భరియించి నా పాపము క్షమియించి

నను నీలా  మార్చుటకు   కలువరిలో మరణించి 

ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి

కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది 

|| ఏపాటి దాననయా ||


1. కష్టాల  కడలిలో కన్నీటి లోయలలో

నాతోడు నిలిచావు నన్నాదరించావు (2)

అందరు నను  విడచినను నను విడువని  యేసయ్య

విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా

ప్రేమించే   ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి

కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది

|| ఏపాటి దాననయా ||


2. నీ ప్రేమను మరువలేనయ్యా  నీ  సాక్షిగా బ్రతికెదనేసయ్య

నేనొందిన నీ  కృపను ప్రకటింతును  బ్రతుకంతా  (2)

నేనొందిన  ఈ జయము  నీవిచ్చినదేనయ్యా - నీ విచ్చిన  జీవముకై  స్తోత్రము యేసయ్య

ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి

కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది

|| ఏపాటి దాననయా ||


Yepati Dhananaya - Telugu Lyrics in English 

Yepati Dhananaya Nanninthaga Hechinchutaku 

Nenenthati Dhananaya Napie Krupa Chuputku (2)

Na Dhoshamu Bhariyinchi Na Papamu Kshamiyinchi

Nanu Neelal Marchutaku Kaluvarilo Maraninchi

Preminche Premamayuda Nee Premaku Parimithulevi

Krupa Chupu Krupagala Dheva Nee Krupaku Sati Yedhi

|| Yepati Dhananaya ||


1. Kastala Kadalilo Kanneti Loyalalo

Na Thodu Nilichavu Nannadharinchavu  (2)

Andharu Nanu Vidachinanu Viduvani Yesayya

Viduvanu Yedabhayanani Nathodie Nilichava

Preminche Premamayuda Nee Premaku Parimithulevi

Krupachupu Krupagala Dheva Nee Krupaku Sati Yedhi

 || Yepati Dhananaya||


2. Nee Premanu Maruvalenayya

Nee Sakshiga Brathikedhanesayya

Nenondhina Nee Krupanu Prakatinthunu Brathukantha (2)

Nenondhina Ee Jayamu Neevichinadhenayya - Neevichina Jeevamukie Sthotramu Yesayya

Preminche Premamayuda Nee Premaku Parimithulevi

Krupachupu Krupagala Dheva Nee Krupaku Sati Yedhi

 || Yepati Dhananaya||

Monday, February 20, 2023

అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను తెలుగు lyrics- Andhala Chinni Gutilona - Puttina Pichukanu Telugu Lyrics in English


Lyrics, Tune & Vocals: SRESHTA KARMOJI 

Music: JONAH SAMUEL

SAMUEL KARMOJI MINISTRIES


అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను  

చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను  (2)

ఈ చిన్ని జీవికి రూపం ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే  

ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ జతకలిపి  పాడమ్మా

లేచే ప్రతి ఉదయం పాడే నా ప్రాణం - పదిలముగా కాచే ప్రభువే నా లోకం  ||అందాల ||


విత్తలేదు నేను కోయలేదు కోట్లలో కూర్చుకోలేదు 

కొరతంటూ నాకు తెలియదు కలతంటూ నాకు లేనే లేదు (2)

పరలోక తండ్రి నాకొరకు అన్ని సమాకుర్చుచున్నాడులే  ... ||అందాల ||


పిచ్చుక విలువ కాసే ఐనా రాలునా తండ్రి కాదన్నా 

తన రూపునే మీకు ఇచ్చుకున్న తనకన్నా ఎవరన్నా ప్రేమించునా ||2||

శ్రేష్ఠమైన మీరు భయపడతగునా మీ తండ్రి తోడుండగా..||అందాల || 

Andhala Chinni Gutilona - Puttina Pichukanu Telugu Lyrics in English 

Andhala Chinni Gutilona - Puttina Pichukanu

Chinni Rekkalu Chachi Nenu - Ningilo Egiranu  (2)

Ee Chinni Jeeviki Roopam Pranam Anni Ichindhi Yese

Prathi Komma Remmalo O Koyilamma - Jathakalipi Padamma

Leche Prathi Udayam Paade Na Pranam 

Padhilamuga Kaache Prabhuve Na Lokam     ||Andhala||


Vithaledhu Nenu Koyaledhu Kotlalo Koorchukoledu 

Korathantu Naku Theliyadhu Kalathantu Naku Lene Ledhu  (2)

Paraloka Thandri Nakoraku Anni Samakurchuchunnadule .... ||Andhala||


Pichuka Viluva Kaase Aina Raaluna Thandri Kaadhanna

Thana Roopune Meeku Ichukunna Thana Kanna Evaranna Preminchuna (2)

Srestulaina Meeru Bhayapadathaguna Mee Thandri Thodundaga... ||Andhala||



ఊరుకో నా ప్రాణమా కలత చెందకు తెలుగు lyrics - Vooruko Na Pranama - Kalatha Chendhaku Telugu Lyrics in English

 

Lyrics, tune, sung by: Dr.Asher Andrew

A Pranam Kamlakhar Musical


పల్లవి:- ఊరుకో నా ప్రాణమా - కలత చెందకు

ఆనుకో ప్రభు రొమ్మున - నిశ్చింతగా ( 2)

అనుపల్లవి:-

ఎడారి దారిలోన - కన్నీటి లోయలోన - (2)

నా పక్షమందు నిలిచి - నా ముందరే నడిచి

నీ శక్తినే చాట - నన్నుంచెనే ఈ చోట

నిన్నెరుగుటే మా ధనం - ఆరాధనే మా ఆయుధం


1. ఎర్రసముద్రాలు - నా ముందు పొర్లుచున్న

ఫరో సైన్యమంతా - నా వెనుక తరుముచున్న-(2)

నమ్మదగిన దేవుడే - నడిపించుచుండగా 

నడి మధ్యలో నన్ను - విడిచిపెట్టునా - (2)  ||ఊరుకో||


2. ఇంతవరకు నడిపించిన - దాక్షిణ్యపూర్ణుడు

అన్యాయము చేయుట - అసంభవమెగా - (2)

వాగ్ధానమిచ్చిన - సర్వశక్తిమంతుడు

దుష్కార్యము చేయుట - అసంభవమెగా - (2)  ||ఊరుకో||


3. అవరోధాలెన్నో - నా చుట్టు అలుముకున్న

అవరోధాల్లోనే - అవకాశాలను దాచెగా - (2)

యెహోవా సెలవిచ్చిన - ఒక్కమాటయైనూ 

చరిత్రలో ఎన్నటికీ  - తప్పియుండలేదుగా - (2)  ||ఊరుకో||


Ooruko Na Pranama Telugu Lyrics in English


Ooruko Na Pranama - Kalatha Chendhaku

Aanuko Prabhu Rommuna - Nischinthaga - (2)


Yedari Dharilona - Kannetiloyalona -(2)

Na Pakshamandhu Nilichi - Na Mundhare Nadichi 

Nee Sakthine Chata - Nannunchene Ee Chota

Ninnerugute Ma Dhanam - Aaradhane Ma Ayudham


1. Yerrasamudhralu - Na Mundhu Porluchunna

Pharo Sienyamantha - Na Venuka Tharumuchunna -(2)

Nammadhagina Dhevude - Nadipinchuchundaga

Nadimadhyalo Nannu - Vidichi Pettuna -  (2)  ||Ooruko||


2. Inthavaraku Nadipinchina - Dhakshinyapornudu

Anyayamu Cheyuta - Asambhavamega - (2)

Vagdhanamichina - Sarvasakthimanthudu

Dhushkaryamu Cheyuta - Asambhavamega -(2) ||Ooruko||


3. Avarodhalenno - Na Chuttu Alumukunna

Avarodhallone - Avakasalanu Dhachega -(2)

Yehova Selavichina - Vokkamatayienanu 

Charithralo Yennatiki - Thappiyundaledhuga - (2)  ||Ooruko||




Friday, February 17, 2023

యేసు లేని నీ జీవితము పొందలేవు మోక్ష రాజ్యము తెలుగు Lyrics, Yesuleni Nee Jeevithamu Pondhalevu Telugu Lyrics In English


గానం :  మేడిది సంపత్ కుమార్ గారు ( Retired Sub Inspector of Police and Intelligence Officer)


 యేసు లేని నీ జీవితము పొందలేవు మోక్ష రాజ్యము (2)

దినములు గడుచుచున్నవి క్షణములు పొర్లుచున్నవి

ఆయుషు తరుగు చున్నది అంతము పిలచుచున్నది  || యేసు || 


1. ఆవిరెగిరి  పోవునట్లు యెగిరి పోవున్నట్లు యెగిరి పోతున్నది 

ఆకాశము కదులున్నట్లు కదులుచున్నది  (2)

అంతమనే దాపునకు చేరనున్నది (2)

ఈ భూమి విడచు గడియకు రానున్నది (2)   || యేసు || 


2. పెరుగుతుంది వయసని అనుకున్నావు 

తరుగుతుంది ఆయువు  తెలియకున్నదా (2)

పరమార్థమిది మనుషులకు తెలియకున్నది 

ప్రభుయేసుని సన్నిధికి రానున్నది (2)    || యేసు || 


Yesuleni Nee Jeevithamu Pondhalevu, Telugu Song Lyrics In English


Yesuleni Nee Jeevithamu Pondhalevu Moksha Rajyamu  (2)

Dinamulu Gaduchuchunnavi Kshanamulu Porluchunnavi

Ayushu Tharuguchunnadhi Anthamu Pilachuchunnadhi   || Yesu || 


1. Aviregiri Povunatlu Yegiri Pothunnadhi

Aakasamu Kadhulunatlu Kadhuluchunnadhi  (2)

Anthamane Dhapunaku Cheranunnadhi (2)

Ee Bhumi Vidachu Gadiyaku Ranunnadhi (2)     || Yesu ||  


2. Peruguthundhi Vayasani Anukunnavu

Tharuguthundi Ayuvu Theliyakunnada (2)

Paramardhamidhi Manushulaku Theliyakunnadhi

Prabhuyesuni Sannidhiki Ranunnadhi (2)     || Yesu ||  

Thursday, February 16, 2023

ఎవరు చూపించలేనీ ఇలలో నను వీడిపోనీ తెలుగు Lyrics, Yevaru Choopinchaleni Ilalo Nanu Veediponi Telugu Lyrics in English

Lyrics & Producer: Joshua Shaik

Music : Pranam Kamlakhar

Vocals : Mohammad Irfan 


ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ

ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ 

మరువనూ యేసయ్య    (2)

నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా   

నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా  ||ఎవరు||


1. తీరాలే దూరమాయే  - కాలాలే మారిపోయే 

ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే 

నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా  

ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా  


ఎడబాటులేని గమనాన

నిను చేరుకున్న సమయాన

నను ఆదరించే ఘన ప్రేమ 

అపురూపమైన తొలిప్రేమ


ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా

ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా   ||ఎవరు||


2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా 

విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం 

నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు

నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ


నీ తోటి సాగు పయనాన

నను వీడలేదు క్షణమైన

నీ స్వరము చాలు ఉదయాన

నిను వెంబడించు తరుణాన


శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో

నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య   ||ఎవరు||

Yevaru Choopinchaleni Telugu Lyrics in English


Yevaru Choopinchaleni Ilalo Nanu Veediponi

Yenthati Prema Needhi Inthaga Korukundi

Maruvanu Yesayya


Nee Kathe Nanne Thaakaga 

Naa Madhe Ninne Cheraga

Naa Gure Neevai Undaga

Nee Dhare Ne Cheraanuga   ||Yevaru||


1. Theerale Dhooramaaye Kaalaale Maaripoye

Yedhuraina Yendamaave Kaneeti Kaanukaaye


Naa Gunde Lothulona Ne Naligipothu Unna

Ye Dhaari Kaanaraka Nee Koraku Vechi Unna


Yedabaatuleni Gamanaana

Ninu Cherukunna Samayaana

Nanu Aadharinche Ghana Prema

Apuroopamaina Tholi Prema


Yekamai Thoduga Oopire Neevuga

Yevvaru Leruga Yesayya Neevega     ||Yevaru||


2. Ee Loka Jeevithaana Vesaaripothu Unna

Viluvaina Needhu Vaakyam Veliginche Naa Praanam


Nee Sannidhaanamandhu Seeyonu Maargamandhu

Nee Dhivya Sevalone Nadipinche Naa Prabhu


Neethoti Saagu Payanaana

Nanu Veedaledhu Kshanamaina

Nee Swaramu Chaalu Udhayaana

Ninu Vembadinchu Samayaana


Saswatha Prematho Sathya Vaakyambhutho

Nithyamu Thoduga Niliche Naa Yesayya    ||Yevaru||




Wednesday, February 15, 2023

నీ రక్త ధారలే మా జీవనాధారము తెలుగు Lyrics, Nee Raktha Dharale Ma Jeevanadharamu Telugu Lyrics in English

 

గానం : మేడిది సంపత్ కుమార్ గారు,(Retired Sub Inspector of Police and Intelligence Officer)

Click the link below to listen to the song

https://youtu.be/jBKmvduV6AU


 నీ రక్త ధారలే మా జీవనాధారము నీ సిల్వ రూపమే

మా భాగ్యమూ  మా మోక్ష భాగ్యము  (2)  || నీ రక్త || 


నీ సిలువ మరణము మానవులెల్లరకు కలిగించే రక్షణ

నీ మరణ  విజయాము జగమందు వెలుగొందు క్రైస్తవ విజయమై 

ఓ యేసు రాజా ..సిల్వ రాజా ..క్రీస్తు రాజా 

దీవించరావా  ఈ సంఘమునూ    || నీ రక్త ||


మాలోన పలికించు జీవన రాగాలు నీ అర్థనాధములే 

మాలోన వెలిగించు జీవన జ్యోతులు  నీ సిల్వ రూపమే 

ఓ యేసు రాజా ..సిల్వ రాజా ..క్రీస్తు రాజా 

దీవించు దేవా ఈ సంఘమునూ    || నీ రక్త || 

Nee Raktha Dharale Ma Jeeva Nadharamu - Telugu Lyrics in English

Nee Raktha Dharale Ma Jeevanadharamu Nee Silva Rupame 

Ma Bhagyamu Ma Moksha Bhagyamu  (2)  || Nee Raktha || 


Nee Siluva Maranamu Manavulellaraku Kaliginche Rakshana

Nee Marana Vijayamu Jagamandhu Velugondhu Kriestava Vijayamie

O Yesu Raja..O Silva Raja..Kristhu Raja

Dheevincharava Ee Sanghamunu    || Nee Raktha || 


Malona Palikinchu Jeevana Ragalu Nee Arthanadhamule

Malona Veliginchu Jeevana Jyothulu Nee Silva Rupame

O Yesu Raja..O Silva Raja..Kristhu Raja

Dheevincharava Ee Sanghamunu    || Nee Raktha || 


Tuesday, February 14, 2023

దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం.. తెలుగు lyrics - Dheva Ninnu Pade Samayam Manchi Samayam Telugu Lyrics in English

 గానం :  Br  Nissy John 

దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం (2)

కష్టమైన శోధనైన నిన్ను పాడెదన్ నిన్ను స్తుతియించెదన్ (2)  ||దేవా||


1. నావా ఒంటరిగా సాగుచుండగా నాధా నిన్నే పాడెదను

జీవితములో నీవుండగా ఎవరిని గూర్చి పాడెదను

శతకోటి పాటలు నిను గూర్చిపాడిన నా ఆశ ఎన్నటికి తీరదయా (2)

కడవరకు నిన్ను కీర్తించి పొగడెద

ప్రా ణా నాధుడా నా జీవనాధుడా  ||దేవా||


2. దేహమంతా కృషియించినా  వాడి నశియించిపోయిన

రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను

క్షణమైనా నిన్ను స్తుతియింప మరచిన జీవిత పయనము వ్యర్ధమయ్యా (2)

జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెద

ప్రా ణా నాధుడా నా జీవనాధుడా  ||దేవా||


Dheva Ninnu Pade Samayam Manchi Samayam Telugu Lyrics in English 


Dheva Ninnu Pade Samayam Manchi Samayam  (2)

Kastamiena Sodhaniena Ninnu Padedhan Ninnu Stuthiyinchedhan  (2)  ||Dheva||


1. Navaa Vontariga Saguchundaga Nadha Ninne Padedhanu

Jeevithamulo Neevundaga Yevarini Gurchi Padedhanu

Sathikoti Patalu Ninu Gurchi Padina Na Aasa Theeradhaya  (2)

Kadavaraku Ninnu Keerthinchi Pogadedha

Prana Nadhuda Na Jeevanadhuda  ||Dheva||


2. Dhehamantha Krusiyinchina Vadi Nasiyinchipoyina

Raktadharalie Pravahinchina Marana Masannamienannu

Kshnamiena Ninnu Sthuthiyimpa Marachina Jeevitha Payanamu Vyardhamayya (2)

Jeevamichina Ninnu Keerthinchi Pogadedha

Prana Nadhuda Na Jeevanadhuda  ||Dheva||

Tuesday, February 7, 2023

నీ పిలుపు వలన నేను, తెలుగు lyrics - Nee Pilupu Valana Nenu Telugu Lyrics in English

Lyrics, Tune & Sung by Ps. BENNY JOSHUA

Telugu Translation Support: FINNY DAVID


 నీ పిలుపు వలన నేను నశించి పోలేదు - నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు 

నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను  - నీ ప్రేమకు సాటి లేదు (2)


1. నశించుటకు ఎందరో వేచియున్నను - నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను

ద్రోహము నిందల మధ్యలో నే నడచినను - నీ నిర్మల హస్తము నన్ను భరియించెను

యజమానుడా నా యజమానుడా…నన్ను పిలచిన యజమానుడా

యజమానుడా నా యజమానుడా…నన్ను నడిపించే యజమానుడా


2. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను - నాకై నీవు తెరచినవి అనేకములు

మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను - నన్ను వెంటాడి నీ సేవను చేసితివి

నా ఆధారమా నా దైవమా - పిలిచిన ఈ పిలుపునకు కారణమా (2)


3. పిలిచిన నీవు నిజమైన వాడవు - నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు

ఏదేమైనను కొనసాగించితివి - నీపై ఆధారపడుటకు అర్హుడవు

నిన్ను నమ్మెదను, వెంబడింతును  - చిరకాలము నిన్నే సేవింతును (2) ||నీ పిలుపు ||


Nee Pilupu Valana Nenu Nasinchi poledhu - Telugu Lyrics in English

Nee Pilupu Valana Nenu Nasinchi Poledhu - Nee Prema Yennadu Nannu Viduvaledhu

Nee Krupa Kachuta Valana Jeevistunnanu - Nee Premaku Sati Ledhu (2)


1. Nasinchutaku Yendharo Vechiyunnanu - Nasimpani Nee Pilupu Nannu Kapadenu

Dhrohamu Nindhala Madhyalo Ne Nadachinanu - Nee Nirmala Hastamu Nannu Bhariyinchenu 

Yajamanuda Na Yajamanuda ... Nannu Pilichina Yajamanuda

Yajamanuda Na Yajamanuda ... Nannu Pilichina Yajamanuda


2. Manushulu Musina Thalupulu Konnienanu - Nakie Neevu Therachinavi Anekamulu

Manovedhanatho Ninnu Vidichi Parugethinanu - Nannu Ventadi Nee Sevanu Chesithivi

Na Adharama Na Dhievama - Pilichina Ee Pilupuku Karanama (2)


3. Pilichina Neevu Nijamiena Vadavu - Nannu Hechinche Alochana Galavadavu

Yedhemienanu Konasaginchithivi - Neepie Adharapadutaku Arhudavu

Ninnu Nammedhanu, Vembhadinthunu - Chirakalamu Ninne Sevinthunu (2)

 ||Ne Pilupu|| 


Saturday, February 4, 2023

మేలుచేయక నీవు ఉండలేవయ్యా Lyrics- Melu Cheyaka Neevu Undalevayya Telugu Lyrics in English


Album RABBUNI SWARALU

Lyrics,Tune&Sung by Rev. T. Job Das

మేలు చేయక నీవు ఉండలేవయ్యా - ఆరాధించక నేను  ఉండలేనయ్యా  (2)

యేసయ్యా యేసయ్యా.. యేసయ్యా యేసయ్యా॥2॥    || మేలు||    

                             

1.నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా

నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండలేక  ॥2॥

నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా  ॥2॥

క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది   ॥ యేసయ్యా॥     


2.ఆరాధించే వేళలందు  - నీదు  హస్తములు తాకాయి నన్ను

పశ్చాత్తాపం కలిగె నాలో  - నేను పాపినని  గ్రహించగానే  ॥2॥

నీ మేళ్ళకు అలవాటయ్యి  - నీ పాదముల్ వదలాకుంటిన్  ॥2॥

నీ కిష్టమైనా దారి కనుగొంటిన్ నీతో  చేరి   ॥యేసయ్యా॥                                      


3.పాపములు చేశాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను 

క్షమియించగలిగే నీ మనస్సు - ఓదార్చింది నా ఆరాధనలో    ॥2॥

నా హృదయము నీతో అంది -నీకు వేరై మనలేనని ॥2॥

అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందకు ॥యేసయ్యా॥

                                                  

Melu Cheyaka Neevu Undalevayya - Telugu Lyrics in English

                                       

Melu Cheyyaka Neevu Undalevayya

Aradhinchaka Nenu Undalenayya 

Yesayya Yesayya.. Yesayya Yesayya ॥2॥     || Melu || 

                                  

1.Ninnu Namminatlu Nenu - Vere Yevarini Nammaledayya

Neeku Naku Madhya Dhuram - Tholaginchavu Vadhilundaleka  ॥2॥

Na Anandham Korevada Na Asalu Theerchevada ॥2॥

Kriyalunna Prema Needhi - Nijamiena Dhanyatha Nadhi  ॥ Yesayya॥     


2. Aradhinche Velalandhu - Needhu Hastamulu Thakayi Nannu

Paschathapamu Kalige Nalo -  Nenu Papinani Grahiyinnchagane  ॥2॥

Nee Mellaku Alavatayyi  - Nee Padhamul Vadhalakuntin          ॥2॥

Nee Kistamiena Dharin Kanugontin Neetho Cheri    ॥ Yesayya॥   

                                                                                        

3. Papamulu Chesanu Nenu - Nee Mundhara Na Thala Yethalenu  

Kshamiyinchagalge Nee Manassu - Odharchindhi Na Aradhanalo ॥2॥

Na Hrudhayamu NeethoAndhi - Neeku Verie Manalenani ॥2॥

Athisayinchedha NIthyamu -  Ninne Kaligunnandhuku     ॥ Yesayya॥                                        

                                      

 

Thursday, February 2, 2023

లెక్కించగలనా నీ మేలులన్ (Lyrics in తెలుగు) - Lekkinchagalana Nee Melulan (Telugu Lyrics in English)

 

రచన,  స్వరకల్పన (Lyricist) :  నాగాబత్తుల భూషణ్ బాబు (Lyricist and Composer of 

Christian Songs)

గానం : పి.  డేవిడ్ అభిషేక్ 

లెక్కించగలనా నీ మేలులన్ - కీర్తించగలనా నీ నామమున్  (2)

ఆరాధనకు యోగ్యుడవు - నా ఆత్మకు జీవము నీవే (2) ||లెక్కించ || 


నా జీవితాన శ్రమలెన్నో రాగా - ఏ దారి లేక నే జారిపోతిని  (2)

చెదరిన నన్ను చేరదీసిన - విడువని కృపతో నన్ను నింపిన 

దేవా నీవే నా కాపరి - దేవా నీవే జీవమైన నా ఊపిరి  ||లెక్కించ || 


నీ వాక్యము మరచి నీ మార్గము విడచి - తొట్రిల్లిన నన్ను ప్రేమతో పిలచితివి  (2)

అలసిన వేళ ఆదరించిన - పిలిచిన ప్రేమా పలుకరించినా 

దేవా నీవే నా కాపరి దేవా నీవే జీవమైన నా ఊపిరి  ||లెక్కించ || 

Lekkinchagalana Nee Melulan Telugu Lyrics in English) 

LYRICS & TUNE: NAGABATHULA BHUSHAN BABU (Lyricist and Composer of Christian Songs)

VOCALS : P . DAVID ABHISHEK

MUSIC: ISRAELRAJ OBA


Lekkinchagalana Nee Melulan - Keerthinchagalana Nee Namamun  (2)

Aradhanaku Yogyudavu - Na Athmaku Jeevam Neeve (2) ||Lekkincha || 


Na Jeevithana Sramalenno Raga - Ye Dhari Leka Ne Jaripothini  (2)

Chedharina Nannu Cheridheesina - Viduvani Krupatho Nannu Nimpina 

Dheva Neeve Na Kapari - Dheva Neeve Jeevamiena Na Upiri  ||Lekkincha || 


Nee Vakyamu Marachi Nee Margamu Vidachi - Thotrillina Nannu Prematho Pilachithivi  (2)

Alasina Vela Adharinchina - Pilichina Prema Palukarinchina 

Dheva Neeve Na Kapari - Dheva Neeve Jeevamiena Na Upiri  ||Lekkincha || 


Hallelujah Hallelujah Halle lujah....

  Hallelujah  Hallelujah  Halle lujah.... Gunde Ninda Yesu Unte Kannille Muthyalu (Tears are pearls if the heart is full of Jesus) Gunde Gud...